భీమవరం: బైకు డిక్కీలో పెట్టిన డబ్బు అపహరణ

89చూసినవారు
భీమవరం: బైకు డిక్కీలో పెట్టిన డబ్బు అపహరణ
అమలాపురానికి చెందిన రమేష్ బాబు నగదును భీమవరం పట్టణంలో వేరొకరికి ఇద్దామనుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కళాభవన్ వీధిలో ఆయన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు డిక్కీ తెరిచి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అపహరణకు గురైన నగదు సుమారు 3 లక్షల వరకు ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్