ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ చేస్తున్న విష ప్రచారం రాష్ట్రానికి అవమానంగా మారిందని భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు ఖండించారు. అమరావతి మహిళలపై జగన్ మీడియా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు వారు తీవ్రంగా నిరసన తెలిపారు. భీమవరం మండలంలోని రాయలం గ్రామంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.