ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కేంద్రాల ద్వారా ఉల్లి, పామాయిల్ తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల కుమార్ రెడ్డి ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆయన బుధవారం కలెక్టరేట్లో ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. తొలుత తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో గురువారం నుంచి ఈ విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కిలో ఉల్లి రూ. 50, పామాయిల్ కిలో రూ. 110 చొప్పున ఈ కేంద్రాల ద్వారా అందిస్తామన్నారు.