భీమవరం: పండుగలా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించాలి

550చూసినవారు
భీమవరం: పండుగలా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించాలి
ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో "మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్" పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులకు ఆహ్వానం అందించాలని సూచించారు. ప్రతి స్కూల్లోనూ తల్లులకు పాదపూజ చేయించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్