బుధవారం భీమవరం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి రీ సర్వే, పి జి ఆర్ఎస్, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సర్వే అధికారులతో సమీక్షించారు. రీ సర్వేపై సమీక్షిస్తూ జిల్లాలో ఫేజ్-1 లో ఉన్న గ్రామాలలో ఈ సర్వే మే నెలఖరి నాటికి పూర్తిచేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.