భీమవరం మండలంలో పలు గ్రామాలకు శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. లోసరి గ్రామంలో విద్యుత్ లైన్లు మరమ్మతుల నిమిత్తం తోకతిప్ప, బర్రెవానిపేట, గరివిడిదిబ్బ, లోసరి, దెయ్యాలతిప్ప, నాగేంద్రపురం, గ్రామాలతోపాటు ఆక్వా చెరువుల లైన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.