పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని స్థానిక 26వ వార్డులోని గంగానమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు వేస్తున్నందున అటువైపు ఆదివారం నుంచి నెల రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పురపాలక కమిషనర్ కె. రామచంద్రారెడ్డి తెలిపారు. కావున వాహన చోదకులు, ప్రయాణికులు సహకరించాలని కోరారు. అలాగే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు.