భీమవరం పట్టణంలోని శ్రీఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఎం. శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఏ. అనురాధ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగోలి, జానపద నృత్యప్రదర్శనాలు, సాంప్రదాయ వంటకాలు, బొమ్మలకొలువు, భోగి మంటలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మావుళ్ళు తదితరులు ఉన్నారు.