క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం గ్రామానికి చెందిన రవాడ కుసుమ లాంగ్ జంప్ క్రీడా విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రీడాకారుణి కుసుమను ప్రోత్సహిస్తూ ది భీమవరం ఎల్ హెచ్ టౌన్ హల్ తరుపున రూ. లక్ష ఆర్ధిక సహాయాన్ని గురువారం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు.