38వ వార్డు శ్రీమహిమాన్విత మావుళ్ళమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ దుర్గమ్మ అమ్మవార్ల 12వ జాతర మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఆలయ అర్చకులు మధు శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జాతర మహోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. 12 ఏళ్లుగా అమ్మవారి జాతర మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.