కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేసిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భీమవరం రూరల్ మండలం దిరుసుమర్రు, రామాయణపురం, దెయ్యాలతిప్ప గ్రామాలలో60లక్షల రూపాయలతో నిర్మించే 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. తానుఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు.