నేటి యువత సమాజ ప్రగతికి పాటుపడాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ది భీమవరం ఎల్ ఎచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో గురువారం పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన 21 మున్సిపల్, ప్రభుత్వ జెడ్పి పాఠశాలలోని 120 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను ఎమ్మెల్యే అందించారు. ప్రతిభవంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, విద్యార్థులను ప్రోత్సహించి ఈ విధంగా పురస్కారాలను అందించడం గొప్ప విశేషమన్నారు.