భీమవరం మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న వీధిలో గురువారం ఒక ఆవు దూడ ఎండలో నీరసించి కిందపడిపోయింది. విషయాన్ని గమనించిన ప్రజలు వెంటనే పశు వైద్యశాఖ, గో సంరక్షణ సమితికి సమాచారం అందించడంతో, వైద్యులు వచ్చి దూడకు చికిత్స అందించారు. రోడ్లపై ఆవులను వదలడం ప్రమాదకరమని, ఇటీవల కొన్ని ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరిస్తున్నారని గో సంరక్షణ అధ్యక్షుడు సుంకర దాసు తెలిపారు.