భీమవరం అడ్డవంతెన వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శనివారం కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.