పెనుగొండకు చెందిన ప్రముఖ కథా, నవలా రచయిత ఎం.ఆర్.వి సత్యనారాయణ మూర్తి, నవల "భూమి పుత్రుడు"ని కేంద్ర ప్రభుత్వ ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, మంగళవారం భీమవరం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న గురించి నవల రాయడం అభినందనీయమని మంత్రి అన్నారు.