భీమవరం యువతిపై మార్ఫింగ్ ఫోటోలు పంపించి నగదు డిమాండ్ చేసిన అబ్దుల్ సమీర్‌పై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన సమీర్ మే 12న భీమవరం వచ్చి యువతిని కలిశాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను అసభ్యంగా మార్ఫ్ చేసి వాట్సాప్‌కు పంపించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని శారీరక సంబంధం పెట్టుకోవాలని, నగదు ఇవ్వాలని బెదిరించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.