స్థానిక కలెక్టరేట్ ఛాంబర్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ నాగరాణిని ఉండి ఎమ్మెల్యే కానుమురు రఘురామ కృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిసి తిరుపతి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టరుతో ఎమ్మెల్యే చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.