పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో భీమవరంలో సాక్షి పత్రిక ప్రతులు దహనం చేశారు. అమరావతిని అవమానించేలా సాక్షి ప్రసారం చేసిన తీరు దారుణమని పేర్కొన్నారు. అమరావతిపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని, సాక్షి మీడియాను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.