సిపిఐ ఉద్యమ నేత కపర్ది వర్ధంతి

51చూసినవారు
సీపీఐ ఉద్యమ నేత, కార్మికోద్యమ నాయకులు ఎంవీఎన్ కపర్దీ 43వ వర్ధంతినీ శనివారం భీమవరం శ్రీనివాస ధియేటర్ సెంటర్లో సీపీఐ స్థూపం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా కపర్దీ చిత్రపటానికి సీపీఐ ప. గో జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, కార్మిక హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎంవీఎన్ కపర్దీ అన్నారు.

సంబంధిత పోస్ట్