భీమవరం పట్టణంలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ.. మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ కాలనీలో ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ నాయకులు ఎం వైకుంఠరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలను అదుపు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.