ప. గో. జిల్లాలో రైతులకు పంటల బీమా పథకం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎకరానికి రైతు రూ. 210 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. రైతుకు మాత్రం ఎకరానికి రూ. 42, 000 నష్టపరిహారంగా అందుతుంది. ప్రీమియం చెల్లింపుకు ఆగస్టు 15వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. ఎన్నడూ లేనివిధంగా పంటల బీమా అందుబాటులో రావడం రైతులకు సార్వా సాగులో ధీమాగా నిలిచే అవకాశం ఉంది.