భీమవరం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి ఉండి గ్రామానికి ముదునూరి పద్మరాజు దంపతులు ఎనిమిది గ్రాముల బంగారాన్ని అమ్మవారికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపర్నెంట్ వాసు పద్మరాజు దంపతులకు శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందించారు.