ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వరద బాధితుల సహాయార్ధం కృష్ణ బలిజ టీడీపి బిసి రాష్ట్ర సాధికారిత కమిటీ సభ్యులు గంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో ₹. 75, 000 సహకారాన్ని బుధవారం ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. అందరూ చేయి చేయి కలిపితేనే వరద పరిస్థితుల నుండి ప్రజలను రక్షించుకోగలుగుతామని అన్నారు.