ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై అధికారులతో జేసీ సమీక్ష

79చూసినవారు
ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై అధికారులతో జేసీ సమీక్ష
భీమవరం జిల్లా కలెక్టరేట్లో జేసీ ప్రవీణ్ ఆదిత్య ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులతో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ట్రాన్స్ జెండర్లకు ఆధార్ కార్డు, పెన్షన్ మంజూరు వంటివాటిపై దృష్టిసారించాలన్నారు. అలాగే సొంతంగా వ్యాపారం నిర్వహించుకునేందుకు ప్రభుత్వ రుణాలు, అర్హులైన వారికి రేషన్ కార్డు మంజూరు వంటి వాటికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్