ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎవరు ఊహించిన విధంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేర్కొన్నారు. మంగళవారం బిజెపి నరసాపురం పార్లమెంట్ కార్యాలయం వద్ద బిజెపి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. శ్యామల దేవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోయే ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయని అన్నారు. కృష్ణంరాజు ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు.