సాంఘిక అణచివేతపై అసమానతలపై మరింత ఉద్య మించాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు పిలుపునిచ్చారు. బుధవారం భీమవరం బి. ఆర్ అంబేద్కర్ భవనంలో కెవిపిఎస్ రాష్ట్ర శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కొయ్యే మోషన్ రాజు మాట్లాడారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి బాబు పాల్గొన్నారు.