ప. గో జిల్లాలో డయేరియా నియంత్రణకు సమగ్ర
కార్యాచరణ, ప్రణాళికతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. డయేరియా ప్రబలకుండా కాచి చల్లార్చిన వేడి నీళ్లు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో మంచినీరు ట్యాంకుల క్లోరినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జేసీ ప్రవీణ్ ఆదిత్య, డీఆర్వో జె. ఉదయ భాస్కర్, ఆర్డీవోలు కె. శ్రీనివాసులు రాజు, అచ్యుత అంబరీష్ పాల్గొన్నారు.