ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న టీచర్లను అభినందిస్తూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రైవేట్ బడులకు మించిన ఫలితాలు సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మధుబాబు, రాజేంద్రప్రసాద్, కరుణాకర్రావు అనే ఉపాధ్యాయులకు హ్యాట్సాఫ్ అన్నారు.