మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే పండుగలేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నాటి సంస్కృతి సంప్రదాయాలు ఆ తరానికే కాకుండా నేటి తరానికి తెలియజేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.