గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 27వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్డులో స్వర్గీయ పిళ్లా ఎలిజబెత్ నవమణి రాజు 32వ వర్ధంతి సందర్భంగా 80 మంది వృద్దులకు చీరలను గురువారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా విక్టర్ దేవరాజ్ వారి తల్లి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం అన్నారు.