నా గెలుపు పవన్ కళ్యాణ్ కు అంకితం: కూటమి అభ్యర్థి

55చూసినవారు
తన గెలుపును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అంకితం చేసినట్లు భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు) పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయానికి అన్యాయానికి జరిగిన యుద్ధంలో ధర్మం విజయం సాధించిందని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్