భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాల్లోని వరి చేలు ముంపు బారినపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం నాటికి 11, 890 ఎకరాల్లో ముంపు బారిన పడినట్లు వ్యవసాయాధికారుల అంచనా వేశారు. దీంతో వరిచేలు నీటిలో నానుతున్నాయి. మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.