ప.గో: గోపాలరావు మృతిపై సీపీఐ సంతాపం

73చూసినవారు
ప.గో: గోపాలరావు మృతిపై సీపీఐ సంతాపం
సినీ నటుడు అల్లం గోపాలరావు మరణం పట్ల సీపీఐ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. గోపాలరావు మొదట్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రజానాట్య మండలిలో కీలక పాత్ర పోషించారని, అభ్యుదయ భావాలతో సమాజంలో మార్పు కోసం శ్రమించారని జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్