పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అధ్యక్షతన జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం, ఆలోచనలు, సమాజానికి అందించిన సేవల గురించి మాట్లాడారు. ఆయన మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని ప్రశంసించారు.