భీమవరం ఉప కేంద్రం పరిధిలో 11 కేవీ లైన్లు మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పెద్ద మసీదు రోడ్డు, వీరమ్మ పార్కు రోడ్డు, రాయప్రోలువారి వీధి, భీమనాథంవారి వీధి, చినపేట, పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.