సూపర్ ఫైన్ రకం బియ్యం పేదలకు అందుబాటులో ఉంచుతామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రైతు బజార్లో గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు విక్రయించే కౌంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పేద ప్రజల మీద ధరల భారాన్ని తగ్గిస్తామన్నారు.