రైతు బజార్ల ద్వారా కూరగాయలు అందజేత

57చూసినవారు
రైతు బజార్ల ద్వారా కూరగాయలు అందజేత
రైతు బజార్ల ద్వారా కూరగాయలను సబ్సిడీ ధరలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప. గో. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరుగుతున్న దృష్ట్యా అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరల్లో విక్రయించేలా ఆలోచన చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్