కూటమికి అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు

65చూసినవారు
కూటమికి అండగా నిలిచి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు అని నరసాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఆయన భీమవరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూటమిని ఆదరించి ఘన విజయాన్ని అందించారని, ప్రజలకు మంచి చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్