ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

53చూసినవారు
ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
భీమవరం ఏరియా ఆసుపత్రిలో జిల్లాస్థాయి ఆసుపత్రి సేవలందించడానికి కృషి చేయాలని కలెక్టర్‌ సి. నాగరాణి ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డు, మందుల నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపి విభాగాలు, ల్యాబ్‌, స్కానింగ్‌, ఎక్సరే యూనిట్లను పరిశీలించారు. సంబంధిత వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రసూతి వార్డులో నవజాత శిశువులను, తల్లులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్