భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

60చూసినవారు
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భవన నిర్మాణ కార్మికులైన మాకు 6 నెలలుగా ఇసుక దొరకక పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, రాత్రి పూట కాకుండా పగలు ఇసుక వెబ్ సైట్ ఓపెన్ అయ్యేలా చేసి మా సమస్యలను పరిష్కరించాలని భీమవరం తాలూకా తాపీ పని వారల యూనియన్ అధ్యక్షులు మెర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి ఏడుకొండలు కోరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు లను మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్