భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన 32 ఏళ్ల కె. మణికంఠ అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. వన్ టౌన్ ఏఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం,స్థానికులు గమనించి మణికంఠను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మణికంఠ మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.