భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో సుమారు రూ. 40 లక్షలతో పిడబ్ల్యూఎస్ పథకంతో భాగంగా రెండు మైక్రో ఫిల్టర్లు మంజూరయ్యాయి. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరికాయ కొట్టి మంగళవారం ప్రారంభించారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో మంచినీటిని అందించడమే లక్ష్యమని అన్నారు. శివారు ప్రాంతాలకు కూడా స్వచ్ఛమైన నీటిని అందిస్తామని తెలిపారు.