వీరవాసరం మండలం కొనితివాడలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న తాతారావును ఎక్సైజ్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 7 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ బలరామరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ కుమార్ మాట్లాడుతూ. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.