భీమవరం టూ టౌన్ పరిధిలో గురువారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామపురం మునిసిపల్ సర్వీస్ నీటి రిజర్వాయర్ వద్ద పంపింగ్ మెయిన్ పైప్ లైన్ మరమతుల నిమిత్తం సాయంత్రం నుంచి 29 - 37వ వార్డులకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. ఆయా వార్డు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.