భీమవరం శివారు ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం మండలం గూట్లపాడు గ్రామం శివారు కొత్త పూసలమర్రులో ఆర్వో వాటర్ ప్లాంట్ ను శనివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం, దొంగ పిండి, లోసరి, నాగిడిపాలెం, దెయ్యాల తిప్పవరకూ శాశ్వత పరిష్కారం చూపుతామని ఏ గ్రామాల్లోనూ మంచినీటి సమస్యలు లేకుండా చేస్తామని అన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.