జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలోని ఎర్రకాలువ జలాశయం నుంచి ఏడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి 6 వేల క్యూసె క్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఆదివారం రాత్రికి ప్రాజెక్టు నీటి మట్టం 81. 32 మీటర్లుగా ఉందని డీఈ రాంబాబు తెలిపారు.