ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శంకుచక్రపురం గ్రామంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పింగుళ్ళ హరీష్ అనే వ్యక్తికి చెందిన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లోనే గృహోపకరణాలు మరియు నగదు అగ్నికి ఆహుతయ్యాయి.