ఏలూరు జిల్లా లింగపాలెం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కలిసి వారి సమస్యలకు సంబంధించి అర్జీలు అందజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు.