జంగారెడ్డిగూడెం పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లాలని టీడిపి పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా గురువారం చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు పట్టణ కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అలాగే రానున్న రోజుల్లో జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.