యువకుడి ఆత్మహత్యాయత్నం

83చూసినవారు
యువకుడి ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం పట్టణం ఆటోనగర్ కు చెందిన ధరేంద్ర అనే యువకుడు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం గుర్వాయిగూడెం మద్ది క్షేత్రం సమీపంలోని వంతెన వద్ద కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ధరేంద్రను స్థానికులు గుర్తించి జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. కారు విషయమై ఓ వ్యక్తి వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు చెందినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్